ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష!

  • ఆర్టీసీ ఎండీ నివేదిక పట్ల హైకోర్టు అసంతృప్తిపై చర్చ
  • ప్రత్యామ్నాయ విధానంపై కసరత్తు
  • రేపు కేబినెట్ సమావేశం
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈరోజు చేపట్టిన విచారణలో ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదికపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులతో భేటీ అయ్యారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలు, ప్రత్యామ్నాయ విధానంపై సమాలోచన జరుపుతున్నట్లు తెలుస్తోంది. రేపు కేబినెట్ సమావేశం కానున్న నేపథ్యంలో ప్రస్తుత సమీక్షలో చర్చిస్తున్న అంశాలపై ఆసక్తి నెలకొంది. కేబినెట్ సమావేశంలో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.  
Go Back to Shorts
TSRTC
Telangana
KCR

More Telugu News