స్టే ఎత్తివేతతో పోలవరం పనులు షురూ.. భూమిపూజ చేసి మొదలెట్టిన మేఘా సంస్థ
- స్పిల్ వే వెనుక భాగంలో పనులు మొదలు
- నిర్ణీత సమయంలోనే ప్రాజెక్టు పూర్తవుతుందన్న మంత్రి అనిల్
- సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అనుకున్న సమయానికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి పనులు ప్రారంభం, పూర్తి చేసే కాలం షెడ్యూళ్లను తమ ప్రభుత్వం ముందే నిర్ణయించుకుందన్నారు. గత ప్రభుత్వం ఆర్.అండ్.ఆర్ ను నిర్లక్ష్యం చేసిందన్నారు. సీఎం జగన్ మాట ఇస్తే ఎటువంటి పరిస్థితిలోనూ తప్పరని పేర్కొన్నారు.