గీత రచయిత జొన్నవిత్తులపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
- 'ఓ నా బుజ్జి జొన్నా' అంటూ ట్వీట్
- నీకు స్త్రీ సాంగత్యం అవసరం అంటూ వ్యంగ్యం
- ఇటీవలే వర్మపై జొన్నవిత్తుల విమర్శలు
వర్మ వ్యాఖ్యలకు కారణం ఉంది. ఇటీవలే జొన్నవిత్తుల మీడియాతో మాట్లాడుతూ, దిక్కుమాలిన ఆలోచనలతో వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడంటూ వర్మపై మండిపడ్డారు. వర్మ ఎంతో ప్రమాదకారి అని పేర్కొన్నారు. వర్మ తనకు టీవీ చర్చా కార్యక్రమంలో జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇచ్చాడని, అందుకే వర్మపై పప్పు వర్మ అనే బయోపిక్ తీస్తానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే వర్మ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు.