చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి గారికి చెందిన శ్రీనివాస థియేటర్స్ కు వెళ్లేవాళ్లం: పవన్ కల్యాణ్
- నటి గీతాంజలి కన్నుమూత
- స్పందించిన పవన్ కల్యాణ్
- గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలంటూ వ్యాఖ్య
అంతేగాకుండా, గీతాంజలితో తమ అనుబంధాన్ని కూడా పవన్ వెల్లడించారు. అప్పట్లో తాము చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి కుటుంబానికి చెందిన శ్రీనివాస థియేటర్స్ కు వెళ్లేవారమని, అక్కడ గీతాంజలి కుటుంబ సభ్యులను కలుస్తుండేవాళ్లమని వెల్లడించారు. ఆ అనుబంధం హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కొనసాగిందని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఆమె కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసైనికుల తరఫున ప్రగాడ సానుభూతి తెలుపుకుంటున్నట్టు మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.