హైదరాబాద్ లో పెరిగిన వాయు కాలుష్యం
- దీపావళి రోజు బాణసంచా కాల్చడంతో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
- సనత్ నగర్ లో అత్యధిక కాలుష్యం నమోదు
- గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగిన కాలుష్యం
పారిశ్రామిక ప్రాంతమైన సనత్ నగర్ లోని ప్రజలు నివసించే ప్రాంతాల్లో అత్యధిక కాలుష్యం నమోదైందని పేర్కొంది. కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్ర పీసీబీ ఏటేటా గాలి నాణ్యతను పరిశీలిస్తోంది. శనివారం వాయు నాణ్యత సూచిక(ఏక్యూఐ) 65 నుంచి 80 మధ్య ఉండగా అదివారం సాయంత్రం నాటికి అది 240కు చేరింది. సనత్ నగర్ లో పండగరోజు సాయంత్రం నాటికి 720 మైక్రో గ్రాములకు చేరింది. గాలిలో ఏక్యూఐ 300 దాటితే ప్రమాదకరంగా పీసీబీ చెబుతోంది. దీనిప్రకారం నగరంలో చాలా చోట్ల ఈ పరిమితి దాటిపోయిందని పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది.