ఐఏఎస్ ఆమ్రపాలికి డిప్యుటేషన్... తెలంగాణకు వీడ్కోలు

  • డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు బదిలీ 
  • వివిధ హోదాల్లో సేవలు అందించిన ఆమ్రపాలి
  • రాష్ట్ర ఎన్నికల అధికారిణిగా రాణింపు
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆమ్రపాలి ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిణిగా పనిచేస్తున్నారు. ఇకముందు  ఆమె ఢిల్లీలోని కేబినెట్ సెక్రెటేరియట్ లో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్ కు చెందిన  2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ప్రమోషన్ పై  ఆమె వరంగల్ అర్బన్ కలెక్టర్ గా పనిచేశారు.
Go Back to Shorts
Amrapali
Telangana
New Delhi

More Telugu News