కోడెల శివప్రసాద్ శత్రువుకు భయపడి సూసైడ్ చేసుకునేంత బలహీనుడు కాదు: ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
- కోడెల అంత పిరికివాడు కాదు
- ఆయన ఇంట్లోనే బాంబులుండేవి
- దగ్గరి వాళ్లే తీవ్రంగా బాధించివుంటారు
అటువంటి వ్యక్తి, ఇప్పుడు జగన్ వంటి నాయకుడు ఇబ్బందులు పెడుతున్నాడనో, అరుణ్ కుమార్ తిట్టాడనో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే తాను నమ్మబోనని అన్నారు. శత్రువుతో తలపడే నైజమే కోడెలకు ఉందిగానీ, పిరికివాడి మాదిరిగా పారిపోయే రకం కాదని అన్నారు. ఎవరో దగ్గరి వాళ్ల నుంచి ఆయనకు తీవ్రమైన అవమానం ఎదురైవుండచ్చని దాంతోనే ఈ జీవితం వ్యర్థమని ఆయన అనుకొని ఉండవచ్చని ఉండవల్లి వ్యాఖ్యానించారు.