మెరుపు వేగంతో స్పందించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది
- తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
- కదులుతోన్న రైలును ఎక్కబోయిన ప్రయాణికుడు
- ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడబోయిన వైనం
ఈ విషయాన్ని గుర్తించిన అక్కడున్న ఆర్పీఎఫ్ సిబ్బంది... ఆ ప్రయాణికుడిని వెంటనే కోచ్ లోకి నెట్టేశాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. సమయానికి ఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడలేకపోయి ఉంటే ప్లాట్ ఫాం, రైలుకి మధ్య ఉన్న సందులో అతడు పడి ప్రాణాలు కోల్పోయేవాడు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.