VH: హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణం వీహెచ్ వ్యాఖ్యలే.. అధిష్ఠానానికి సతీశ్ మాదిగ ఫిర్యాదు

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వీహెచ్ వ్యాఖ్యల వల్లే హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిందని పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్ మాదిగా ఆరోపించారు. ఈ మేరకు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. రాజీవ్ కాంగ్రెస్ పేరుతో పార్టీ పెట్టబోతున్నట్టు వీహెచ్ ప్రకటించారని సతీశ్ మాదిగ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమన్న సతీశ్ మాదిగ.. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వీహెచ్ వ్యాఖ్యలు సరికావన్నారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వీహెచ్ నుంచి డి.శ్రీనివాస్ వరకు అందరూ బీసీలేనన్న విషయాన్ని వీహెచ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వీహెచ్ వ్యాఖ్యల వల్లే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఓటమి పాలైందని సతీశ్ మాదిగ ఆరోపించారు.
Go Back to Shorts
VH
satish madiga
Congress
Telangana

More Telugu News