రాజస్థాన్ లో హఠాత్తుగా కుప్పకూలిన కాలువపై ఫుట్‌పాత్‌.. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు

  • బాధితులను కాపాడిన స్థానికులు
  • రాజస్థాన్‌లోని సిరోహి పట్టణంలో ఘటన
  • అధికారులపై విమర్శల వెల్లువ
కాలువపై ఉన్న ఫుట్‌పాత్‌ హఠాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై నడిచి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోగా, అనంతరం మరికొంత భాగం కూలడంతో మరో వ్యక్తి బాధితుడయ్యాడు. రాజస్థాన్‌ రాష్ట్రం సిరోహి పట్టణంలో జరిగిన ఈ ఘటన అధికారులపై విమర్శల దాడికి ఆయుధమైంది. సమీపంలోని సీసీ కెమెరాల్లో ఈ ఘటన నమోదు కావడంతో చూసిన వారు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అదృష్టవశాత్తు ఇద్దరి ప్రాణాలు దక్కాయని, నిర్మాణంలో నాణ్యత లోపాలే ఘటనకు కారణమని, ఇటువంటి నిర్మాణాలుంటే తొలగించాలని డిమాండ్‌ చేశారు.
Go Back to Shorts
accident
Rajasthan
footpath
colopsed
two injured

More Telugu News