హానీ ట్రాప్ ఉచ్చులో పడి లక్షలు సమర్పించుకున్న విశాఖ వాసులు
- ఫేక్ డేటింగ్ సైట్లతో హానీ ట్రాప్
- రూ. 18 లక్షలు పోగొట్టుకున్న విశాఖ యువకుడు
- కోల్ కతాలో 27 మందిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు
విశాఖలో ఒకరి నుంచి రూ. 18 లక్షలు, మరొకరి నుంచి రూ. 3 లక్షలను ఈ గ్యాంగ్ కాజేసింది. ఇంకా బయటపడని బాధితులు చాలా మందే ఉంటారని అనుమానం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. తీగ లాగితే కోల్ కతాలో డొంక కదిలింది. దీంతో కోల్ కతాకు వెళ్లిన విశాఖ పోలీసులు... అక్కడున్న 24 మంది టెలికాలర్లతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. 3 ల్యాప్ టాప్ లు, 40 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు వీరిని కోల్ కతా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పీటీ వారెంట్ కు కోర్టు అనుమతిస్తే... వారందరినీ విశాఖకు తీసుకొచ్చి లోతుగా దర్యాప్తు చేస్తారు.