సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళికి కూడా అధిక బోనస్
- నిన్న సాయంత్రం దీపావళి బోనస్ పంపిణీ
- దసరా సమయంలో లాభాల్లో పంపకం
- కార్మికుల ఖాతాల్లో జమ చేసిన యాజమాన్యం
దసరా పండుగకు ముందు సింగరేణి యాజమాన్యం రూ.494 కోట్ల లాభాలను కార్మికులకు బోనస్‌గా పంపిణీ చేసింది. తాజాగా పంపిణీ చేసిన బోనస్‌తో కలుపుకుంటే ఒక్కో కార్మికుడు ఏకంగా లక్ష రూపాయల బోనస్ అందుకున్నట్టు. దేశంలో ఓ ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులకు చెల్లించిన అత్యధిక బోనస్ ఇదే కావడం గమనార్హం.