Kalyan Dev: రెండో సినిమాకు సిద్ధమైన మెగాస్టార్ చిన్నల్లుడు

  • విజేత చిత్రంతో పరిచయం అయిన కల్యాణ్ దేవ్
  • తొలి చిత్రంలో నటనకు మంచి మార్కులు
  • బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోని విజేత
విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ మరో సినిమాలో నటించేందుకు రంగం సిద్ధమైంది. రిజ్వాన్ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నామని కల్యాణ్ దేవ్ ట్విట్టర్ లో తెలిపారు.

కాగా విజేత చిత్రంలో కల్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సైమా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా పురస్కారం కూడా అందుకున్నాడు. కానీ సినిమా పరంగా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దాంతో రెండో చిత్రం కోసం ఈ మెగా అల్లుడు టైమ్ తీసుకోవాల్సి వచ్చింది.  
Kalyan Dev
Tollywood
Chiranjeevi

More Telugu News