cm: జగన్ పై విమర్శలు చేయడమే పవనిజమా?: ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్

  • టీడీపీతో లాలూచీ, జగన్ తో పేచీ మీ వైఖరా
  • జగన్ పై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని తెలియదా
  • నిజాయతీ రాజకీయాలు చేయాలి
ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘జగన్ పై విమర్శలు చేయడమేనా పవనిజం? తెలుగుదేశం పార్టీతో లాలూచీ పడ్డ మీరు జగన్ తో పేచీ పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల వైఖరిని విమర్శిస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటి? అన్న మీరు ఇప్పుడు తెదేపాతో కలిసి చేస్తున్నదేమిటి?’ అని నిలదీశారు.

జగన్ పై కేసులున్నాయని చెబుతున్న పవన్ అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులని గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎలాంటి కేసులు లేని పవన్ బీజేపీని ఇప్పటివరకు ఒక్కసారైనా ప్రశ్నించారా? అని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రం ఏ రకంగా వెనక్కి వెళ్లిందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం తప్పులు మీకు కన్పించడం లేదా? అని పవన్ ను సూటిగా ప్రశ్నించారు. నిజాయతీ రాజకీయాలు చేయాలన్నారు.
cm
jagan
minister
Pernni Nani
Pawan Kalyan

More Telugu News