మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే అంటూ పోస్టర్లు
- శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే
- వర్లి నుంచి గెలుపొందిన ఆదిత్య ఠాక్రే
- ఆయనకు సీఎం పదవి కోసం శివసేన డిమాండ్
బీజేపీతో తమ మిత్రత్వం కొనసాగుతుందని, ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరతామని ఇప్పటికే శివసేన నేత సంయజ్ రౌత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇదే విషయంపై ఉద్ధవ్ ఠాక్రే కూడా మాట్లాడారు. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని స్పష్టం చేశారు. '50-50 ఫార్ములా అమలు చేయాలని భావించాం. దీనిపై చర్చలు జరిపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించాలన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' అని అన్నారు.
ఇరు పార్టీల నేతలు రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రిగా కొనసాగాలని శివసేన నేతలు అంటున్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలతో ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. 288 సీట్లకు జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 161, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 98, మజ్లిస్ 2 స్థానాల్లో గెలుపొందగా 27 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.