యడియూరప్పకు షాక్.. ప్రచారం చేసిన చోటల్లా చిత్తుగా ఓడిన బీజేపీ!

  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో యెడ్డీ ప్రచారం
  • లింగాయతులు ఎక్కువగా ఉండే 3 జిల్లాల్లో ముమ్మర ప్రచారం
  • ఆల్మట్టి నుంచి నీరు ఇస్తామన్నా.. పట్టించుకోని ఓటర్లు
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు టైమ్ బాగున్నట్టు లేదు. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు. సాంగ్లి, సొల్లాపుర, కొల్హాపుర జిల్లాల్లో లింగాయత్ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో... బీజేపీ తరపున ఆయన సుడిగాలి పర్యటనలు నిర్వహించారు.

అయితే, యడియూరప్పతో ప్రచారం నిర్వహించి, ఓట్లను రాబట్టుకోవాలనుకున్న బీజేపీ అధిష్ఠానం ఎత్తుగడ ఘోరంగా విఫలమైంది. యెడ్డీ ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ అభ్యర్థులు చిత్తుగా ఓడారు. కొల్హాపుర జిల్లాలో ఏకంగా 10 చోట్ల బీజేపీ ఓడిపోయింది. ఆల్మట్టి నుంచి మహారాష్ట్రలోని 48 గ్రామాలకు నీరు ఇస్తామని యెడ్డీ హామీ ఇచ్చినప్పటికీ... ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. ప్రతికూల ఫలితాల నేపథ్యంలో, యడియూరప్ప షాక్ కు గురయ్యారు.
Go Back to Shorts
Yediyurappa
Karnataka
Maharashtra
election
BJP

More Telugu News