Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 రోజులు పూర్తిచేసుకోనున్న 'ఇస్మార్ట్ శంకర్'

  • జూలై 18న వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'
  • పూర్తి మాస్ కథాంశాన్ని అందించిన పూరి
  • సక్సెస్ కి ప్రధాన కారణంగా నిలిచిన మణిశర్మ సంగీతం  
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా ఈ ఏడాది జూలై 18వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా మాస్ ఏరియాల్లో ఈ సినిమా విజయవిహారం చేసింది. ఆ తరువాత విడుదలైన చాలా సినిమాల పోటీని తట్టుకుంటూ నిలబడిన ఈ సినిమా, ఈ రోజుతో 100 రోజులను పూర్తి చేసుకోనుంది.

రామ్ మాస్ లుక్ .. ఆయన తెలంగాణ యాస మాట్లాడటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటు నిధి అగర్వాల్ .. అటు నభా నటేశ్ గ్లామర్ డోస్ పెంచేయడం మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు దక్కడానికి కారణమైంది. ఇక మణిశర్మ అందించిన బాణీలు మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశాయి. చాలాకాలం తరువాత పూర్తి పూరి మార్కుతో వచ్చిన కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి విజయం లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Ram
Nidhi
Nabha

More Telugu News