Budda Venkanna: బిచ్చగాళ్ల దగ్గర చిల్లర కొట్టేసే నీకు అమరావతి విలువ ఏం తెలుస్తుంది?:  విజయసాయిపై బుద్ధా వ్యాఖ్యలు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. చంద్రబాబు గారు ఐదేళ్లు కష్టపడి అమరావతికి ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చారు, దాన్ని మీ తుగ్లక్ ముఖ్యమంత్రి 5 నెలల్లో నాశనం చేసి అమరావతిని ఎడారిగా మార్చేశారు అంటూ మండిపడ్డారు.

 అయినా బిచ్చగాళ్ల వద్ద చిల్లర కొట్టేసే నీకు అమరావతి విలువ ఏం తెలుస్తుందిలే అంటూ విజయసాయిని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు. "నీకే గనుక ధైర్యం ఉంటే రాజధానికి భూములిచ్చిన రైతుల ముందుకు వచ్చి మీ పార్టీ అమరావతికి అనుకూలమో కాదో చెప్పాలి, ఆపై మిగతా విషయాలు రైతులే చూసుకుంటారు" అంటూ ట్వీట్ చేశారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News