డైట్ ప్లాన్ చెప్పేందుకొచ్చి యువతిపై అత్యాచారం.. న్యూట్రిషన్ సంస్థ ఉద్యోగి అరెస్ట్!
- మల్కాజిగిరిలో ఘటన
- యువతి ఒంటరిగా ఉండడంతో బెదిరించి అత్యాచారం
- బయటపెడితే యాసిడ్ పోస్తానని బెదిరింపు
ఆమె ఇంటికి వెళ్లిన సాజిద్ యువతికి డైట్ ప్లాన్ వివరిస్తూ ఇంటిని పరిశీలించాడు. ఇంట్లో ఆమె తప్ప మరెవరూ లేరని నిర్ధారించుకున్నాడు. ఆమెను చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ నెల 16న ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా సాజిద్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిది యూసుఫ్‌గూడ అని తెలిపారు.