దీపావళి నాడు రాజకీయ నాయకులకు, రౌడీలకు, ఫ్యాక్షనిస్ట్ లకు నేనిచ్చే బహుమతి ఇది: రామ్ గోపాల్ వర్మ

  • 27న ఉదయం 9.36 గంటలకు ట్రయిలర్
  • ట్విట్టర్ లో వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ
  • ఇప్పటికే ఓ పాటను విడుదల చేసిన వర్మ
తాను నిర్మిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ట్రయిలర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "అక్టోబర్ 27న ఉదయం 9.36 గంటలకు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ట్రయిలర్ ను విడుదల చేస్తున్నాం. దీవాలీ సందర్భంగా రాజకీయ నాయకులకు, జర్నలిస్టులకు, రౌడీలకు, ఫ్యాక్షనిస్టులకు, పోలీసులకు, సామాన్య ప్రజలకు నేనిచ్చే బహుమతి ఇదే. గాడ్ బ్లస్" అని ఆయన ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పాటను ఆయన యూట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిపైనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా, ట్రయిలర్ ఎంత సంచలనాన్ని క్రియేట్ చేసి, మరెన్ని విమర్శలను తెస్తుందోనన్న చర్చ జరుగుతోంది.
Go Back to Shorts
Kamma Rajyamlo Kadapa Redlu
Dewali
Ramgopal Varma
Trailer

More Telugu News