ధోనీ రిటైరయ్యాడా... మా ఆయనే ఎందుకు రిటైరవ్వాలి?: విమర్శకులను ప్రశ్నించిన పాక్ క్రికెటర్ సర్ఫరాజ్ అర్ధాంగి
- కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయిన సర్ఫరాజ్
- రిటైరవ్వాలన్న విమర్శకులు
- ఘాటుగా స్పందించిన సర్ఫరాజ్ భార్య కుష్ బహత్
"ధోనీ మా ఆయన కంటే ఎంతో పెద్దవయస్కుడు. మావారి వయసు 32 ఏళ్లే! ధోనీ వయసెంత? మరి ధోనీ రిటైరయ్యాడా? మా ఆయనే ఎందుకు రిటైరవ్వాలి?" అంటూ విమర్శకులను నిలదీసింది. అంతేకాదు, సర్ఫరాజ్ ఓ పోరాట యోధుడని, తప్పకుండా జట్టులోకి పునరాగమనం చేస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవలే సర్ఫరాజ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన పీసీబీ, పరిమిత ఓవర్ల జట్టుకు, టెస్టు జట్టుకు వేర్వేరుగా కెప్టెన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.