వ్యూహాత్మకంగా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నాలు.. ఆటోలో వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు
- పోలీసులను తప్పించుకొని వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి
- అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతామని వ్యాఖ్య
- న్యాయస్థాన ఆదేశాలను కూడా సర్కారు లెక్కచేయట్లేదని ఆగ్రహం
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. న్యాయస్థాన ఆదేశాలను కూడా సర్కారు లెక్కచేయట్లేదన్నారు. ఈ వైఖరితో జనాల్లోకి సర్కారు తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు.