ముగ్గుర్ని ప్రేమించిన యువతి.. చివరకు శవంగా మారిన వైనం!

  • ఐదేళ్ల క్రితం ప్రేమికుడితో వెళ్లిపోయిన యువతి
  • పట్టించుకోవడం మానేసిన తల్లిదండ్రులు
  • చేతిపై ‘పునీత్’ పేరుతో పచ్చబొట్టు 
తాను మేజర్‌నని పోలీసులకు చెప్పి ఐదేళ్ల క్రితం ప్రేమికుడితో వెళ్లిపోయిన ఓ యువతి తాను దిగిన హోటల్ వెనకే శవమైంది. కర్ణాటకలోని హసన్ పట్టణంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అరుకలగూడుకు చెందిన భవిత (23) తన 18వ ఏటనే ప్రేమించిన యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాను మేజర్‌నని, ప్రియుడితోనే ఉంటానని చెప్పడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో అప్పటి నుంచి తల్లిదండ్రులు కుమార్తెను పట్టించుకోవడం మానేశారు.

తాజాగా, నిన్న ఉదయం హసన్‌లోని సరయు హోటల్ వెనక యువతి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను హత్య చేశారా? లేక, ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె ముగ్గురిని ప్రేమించినట్టు పోలీసులు తేల్చారు.

ఆమె చేతిపై మాత్రం ‘పునీత్’ అన్న పచ్చబొట్టు ఉంది. 12 రోజుల క్రితం ఈ హోటల్‌లో దిగిన భవిత హోటల్‌లో ఉన్న ఫొటోలను తన పేస్‌బుక్‌లోనూ అప్‌డేట్ చేసింది. శనివారం రాత్రి పునీత్ హోటల్‌కు వచ్చాడు. ఆదివారం ఉదయం హోటల్ వెనక భవిత మృతదేహం కనిపించడంతో సంచలనమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Karnataka
Hassan
lover
murder
suicide

More Telugu News