ఆమె ఇండియన్ మెరిల్ స్ట్రీప్... రమ్యకృష్ణతో తన ఫ్రెండ్షిప్ గురించి చెప్పిన చార్మి

  • రొమాంటిక్ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్ర
  • షూటింగ్ లో పాల్గొంటున్న సీనియర్ నటి
  • సోషల్ మీడియాలో చార్మి స్పందన
టాలీవుడ్ లో నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ప్రముఖ నటి చార్మి సీనియర్ నటి రమ్యకృష్ణతో తన స్నేహబంధం గురించి వివరించారు. తమ మధ్య 16 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఉందని తెలిపింది. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి చార్మి, పూరీ జగన్నాథ్ నిర్మాతలు. రమ్యకృష్ణ కొన్నిరోజులుగా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది.

ఈ సందర్భంగా చార్మి సోషల్ మీడియాలో స్పందించారు. రమ్యకృష్ణను హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ తో పోల్చిన చార్మి, వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ మీరంటే నాకెంతో ఇష్టం అంటూ తన అభిమానం చాటుకుంది. మున్ముందు కూడా తమ స్నేహబంధం ఇలాగే కొనసాగాలంటూ పేర్కొంది.

మెరిల్ స్ట్రీప్
Go Back to Shorts
Ramyakrishna
Charmme
Tollywood
Puri Jagannadh

More Telugu News