'బోలో తారా రారా' పాట పాడుతూ.. ఉత్సాహంగా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న పోలీసు
- చండీగఢ్ కు చెందిన భూపిందర్ సింగ్
- ట్రాఫిక్ నిబంధనలపై వినూత్న రీతిలో అవగాహన
- వీడియో వైరల్
దలేర్ మెహంది పాట 'బోలో తారా రారా' పాట పాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై భూపిందర్ సింగ్ అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. గతంలోనూ ఆయన డ్రంకెన్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా నియమాలపై ఇటువంటి పాటల ద్వారానే అవగాహన కల్పించారు.
ఇటువంటి వినూత్న ప్రయోగాల వల్ల ప్రజలు ట్రాఫిక్ నిబంధనల గురించి శ్రద్ధగా విని నేర్చుకుంటున్నారని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం భారీ జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుందని ఆయన అవగాహన కల్పిస్తున్నారు.