ఇంకోసారి దురుసుగా మాట్లాడబోనన్న బీజేపీ ఎమ్మెల్యే!
- కేంద్ర మంత్రులను టార్గెట్ చేసిన యత్నాళ్
- క్రమశిక్షణా సంఘం నోటీసులు
- బాధితులను చూసి ఆవేదనతోనే మాట్లాడానని వివరణ
దీనిపై స్పందించిన యత్నాళ్, క్రమశిక్షణా విభాగానికి లేఖను పంపుతూ, వరద బాధితులకు సాయం అందలేదన్న ఆవేదనతోనే అలా మాట్లాడానని, తనలో ఏ దురుద్దేశమూ లేదని చెప్పారు. పార్టీలో తాను క్రమశిక్షణ గల సైనికుడి వంటివాడినని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టివుంటే క్షమించాలని లేఖలో రాశారు. ప్రధాని, పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రులను హేళన చేయాలన్న ఆలోచన తనకు ఎన్నడూ లేదని చెప్పారు.