భారీ వర్షంలో తడుస్తూ ప్రసంగించిన శరద్ పవార్!
- సతారాలో ఎన్నికల ప్రచారం
- నేను గత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సరైన అభ్యర్థిని నిలబెట్టలేదు
- ఈ పొరపాటును నేను అంగీకరిస్తున్నాను
'నేను గత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఈ నియోజక వర్గంలో సరైన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ పొరపాటును నేను అంగీకరిస్తున్నాను. అయితే, ఈ సారి నేను చాలా సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే ఆ ఎన్నికల్లో చేసిన పొరపాటును సరిదిద్దడానికి అక్టోబరు 21 కోసం సతారా ప్రజలు ఎదురుచూస్తున్నారు' అని చెప్పారు. ఈసారి సరైన అభ్యర్థిని నిలబెట్టానని వారికే ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు.
కాగా, 288 సీట్లకు జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తుతో పోటీ చేస్తున్నాయి. వీటి ఫలితాలు అక్టోబరు 24న వెల్లడవుతాయి.