తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్.. కదలని బస్సులు.. కార్మికుల అరెస్ట్‌లు
- ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
- బంద్‌కు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల మద్దతు
- డిపోల నుంచి బయటకు రాని బస్సులు
మరోవైపు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోధన్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, హైదరాబాద్‌లోనూ బంద్ కొనసాగుతోంది. నగరంలోని పలు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. మొత్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.