నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఈ-కామర్స్ సంస్థలపై కఠిన చర్యలు: పీయూష్ గోయల్
- ఎఫ్డీఐ విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతానికి మించకూడదు
- రిటైల్ మార్కెట్ ను దెబ్బ తీసేలా వస్తువులపై డిస్కౌంట్లు ఉండొద్దు
'రిటైల్ మార్కెట్ ను దెబ్బ తీసేలా వస్తువులపై డిస్కౌంట్లు, మోసపూరిత ధరలు ప్రకటించే హక్కు ఈ-కామర్స్ సంస్థలకు లేదు. అలాగే, సొంతంగా ఉత్పత్తులను తయారు చేసుకుని, విక్రయించే హక్కు కూడా లేదు. ఇటీవల ప్రకటించిన ధరల విషయంలో పూర్తి వివరణ ఇవ్వాలని ఈ-కామర్స్ సంస్థలను వాణిజ్య శాఖ ఇప్పటికే ఆదేశించింది' అని పీయూష్ గోయల్ వివరించారు. కాగా, పండుగల నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించి, వినియోగదారులను ఆకర్షించిన విషయం తెలిసిందే.