త్వరలో పీవోకే మనదవుతుంది.. వ్యూహ రచన జరుగుతోంది: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ
- రామ మందిర నిర్మాణం జరుగుతుందన్న రూపాని
- సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడి
- బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందంటూ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దుకు సంబంధించిన హామీని బీజేపీ నెరవేర్చిందని పేర్కొన్నారు. ఇదే రీతిలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామన్న హామీని కూడా నెరవేరుస్తామన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత ఆలయ నిర్మాణ పనులు చేపడతామన్నారు.