సవాల్ కు సిద్ధమా శకుని మామా?: బుద్ధా వెంకన్న
- ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణకు ఎందుకు భయపడుతున్నారు?
- లీకు వీరుడిని పట్టుకుని గ్రీకు వీరుడు అన్నట్టు విల్డప్ ఇస్తున్నావు
- నేను, జగన్ పరీక్ష రాస్తాం.. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందాం
లీకు వీరుడిని పట్టుకుని గ్రీకు వీరుడు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు అంటూ ఎద్దేవా చేశారు. 'నీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు లీక్ చేసిన పేపర్ నాకు కూడా పంపండి. నేను, మీ తుగ్లక్ ముఖ్యమంత్రి పరీక్ష రాస్తాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందాం. సవాల్ కు సిద్ధమా శకుని మామా?' అంటూ విజయసాయిని ఛాలెంజ్ చేశారు.