చేతిలో తుపాకులతో హిందీ పాటకు డ్యాన్స్.. వీడియో వైరల్.. విచారణకు ఆదేశం
- దర్యాప్తు ప్రారంభించిన హరిద్వార్ పోలీసులు
- ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత కరవు
- గతంలో బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇలానే
ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్టు హరిద్వార్ సర్కిల్ అధికారి అభయ్ సింగ్ తెలిపారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ ఘటన హరిద్వార్‌లోనే జరిగిందా? లేక, మరెక్కడైనానా? అన్న విషయం దర్యాప్తులో తెలుస్తుందన్నారు. కాగా, ఈ ఏడాది జూలైలో బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ కూడా ఇలానే డ్యాన్స్ చేసి పార్టీ నుంచి సస్పెండయ్యారు. పోలీసులు అతడి గన్ లైసెన్స్‌ను రద్దు చేశారు.