మేం ఎన్ని సవాళ్లు విసిరామో కోహ్లీ అన్నింటికి సమాధానం ఇచ్చాడు: డుప్లెసిస్
- పుణే టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ
- ప్రశంసల వర్షం కురిపించిన సఫారీ కెప్టెన్
- స్వభావానికి భిన్నంగా ఆడాడంటూ వ్యాఖ్యలు
సాధారణంగా కోహ్లీ రాగానే పరుగుల మీద పడిపోతాడని, ఈసారి అందుకు భిన్నంగా నిదానంగా ఆరంభించి, ఆ తర్వాత ఎదురుదాడికి పాల్పడతాడని తాము ఊహించలేకపోయామని అన్నాడు. తాము ఎన్ని సవాళ్లు విసిరామో కోహ్లీ వాటన్నింటికి సమాధానం ఇచ్చాడని డుప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుణేలో కోహ్లీని చూస్తే 100, 150తో సంతృప్తి పడేట్టు కనిపించలేదని తెలిపాడు.