నేడు స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు!
- తగ్గిన క్రూడాయిల్ ధరలు
- లీటర్ పెట్రోల్ పై 10 పైసల తగ్గింపు
- 15 పైసలు తగ్గిన డీజిల్ ధర
ఈ తగ్గుదల తరువాత హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.99కు చేరగా, డీజిల్ ధర రూ. 72.47కు తగ్గింది. అమరావతిలో పెట్రోల్ ధర రూ. 77.58కి, డీజిల్ ధర రూ. 71.75కు చేరింది. విజయవాడలోనూ ధరలు దాదాపు ఇదే విధంగా ఉన్నాయి.
ఇక దేశ రాజధాని న్యూఢిల్లీ విషయానికి వస్తే, నిన్నటితో పోలిస్తే 10 పైసల మేరకు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 73.32కు, 14 పైసలు తగ్గిన డీజిల్ ధర రూ. 66.46కు చేరుకున్నాయి.