నాటి పల్లవరాజు కుమారభిక్షువే... చైనీయుల ఆరాధ్యుడు బోధి ధర్ముడు... అందుకే మహాబలిపురాన్ని కోరిన జిన్ పింగ్!
- మహాబలిపురంలో భేటీ కానున్న మోదీ, జిన్ పింగ్
- ఈ పట్టణంతో చైనాకు చారిత్రక అనుబంధం
- ఇక్కడి నుంచి చైనాకు వెళ్లి ఆరాధ్యుడైన బోధి ధర్ముడు
దాదాపు 1200 సంవత్సరాల క్రితం... అంటే 7, 8 శతాబ్దాల సమయంలో మహాబలిపురాన్ని పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని ఓ మహా నగరంగా మార్చారు. ఈ నగరానికి, చైనాకు ఓ చారిత్రక అనుబంధం ఉంది. మూడో పల్లవరాజు కుమార విష్ణువు ఎన్నో యుద్ధ విద్యల్లో, వైద్య కళల్లో నిష్ణాతుడు. ఆయన బౌద్ధమతం స్వీకరించి, ఓ పని నిమిత్తం చైనాకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతాడు. చైనాలో ఆయన బోధి ధర్ముడు. చైనాలో బోధి ధర్ముడు ఎంతో ఆరాధ్యుడు. అక్కడి ప్రజలు నిత్యమూ ఆయన్ను పూజిస్తుంటారు.
ఈ కారణం చేతనే తమకు ఆరాధ్యుడైన కుమార విష్ణువు నడయాడిన ప్రాంతాన్ని తిలకించాలని భావించిన జిన్ పింగ్, మహాబలిపురాన్ని ఎంచుకున్నారు. కాగా, బోధి ధర్ముడి కథపై ఆ మధ్య సూర్య, శ్రుతి హాసన్ జంటగా ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.