మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,520, విజయవాడలో రూ.37,860, ప్రొద్దుటూరులో రూ.37,800, చెన్నైలో రూ.38,270గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,720, విజయవాడలో రూ.35,100, ప్రొద్దుటూరులో రూ.35,020, చెన్నైలో రూ.36,700గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,950, విజయవాడలో రూ.46,900, ప్రొద్దుటూరులో రూ.46,700, చెన్నైలో రూ.49,900 వద్ద ముగిసింది.