Narendra Modi: అధికార పీఠంపై 8,931 రోజులు... ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత చరిత్రలోనే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నేతగా అరుదైన ఘనత అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశానికి 8,931 రోజుల పాటు సేవ చేసి చారిత్రక మైలురాయిని చేరుకోవడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
"గౌరవనీయులైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక అభినందనలు. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా సేవలందించిన వ్యక్తిగా చారిత్రక మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశానికి 8,931 రోజుల పాటు సేవను పూర్తి చేసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన విజయం.
ఈ అసాధారణ ఘనత, మన దేశ ప్రగతి, శ్రేయస్సు పట్ల ఆయనకున్న అంకితభావానికి, దార్శనిక నాయకత్వానికి, అవిశ్రాంత నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. 2047 నాటికి 'వికసిత భారత్'ను నిర్మించాలన్న ఆయన దార్శనికత మనందరిలో స్ఫూర్తిని నింపుతూ, దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తోంది.
దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే ఈ ప్రయాణంలో ఆయనకు మరింత శక్తి, మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.