మహిళను హిప్నటైజ్ చేసి, అత్యాచారయత్నం చేసిన అమెజాన్ డెలివరీ బాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళను హిప్నటైజ్ చేసి, అత్యాచారయత్నం చేసిన అమెజాన్ డెలివరీ బాయ్!

  • వస్తువులను రిటర్న్ తీసుకోవడానికి కస్టమర్ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్
  • డెలివరీ బాయ్ తో సదరు మహిళకు వాగ్వాదం
  • డెలివరీ బాయ్ కోసం గాలిస్తున్న పోలీసులు
ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన అమెజాన్ డెలివరీ బాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, 43 ఏళ్ల ఓ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. అమెజాన్ లో ఆమె ఐదు బాక్స్ లను బుక్ చేసింది. పార్సిల్ డెలివరీ అయిన తర్వాత చూస్తే అవి ఆమెకు నచ్చలేదు. దీంతో, వాటిని వెనక్కి తీసుకెళ్లాలంటూ రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో, వాటిని తీసుకునేందుకు ఓ డెలివరీ బాయ్ (30)ను అమెజాన్ పంపింది.

కస్టమర్ నివాసానికి వెళ్లిన సదరు డెలివరీ బాయ్ ఐదు బాక్సులను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. నాలుగు బాక్సులు మాత్రమే తీసుకోవాలని తనకు చెప్పారని తెలిపాడు. ఈ నేపథ్యంలో, ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో బాధితురాలు కస్టమర్ కేర్ తో ఫోన్ ద్వారా మాట్లాడి... ఐదు బాక్సులను తీసుకోవడానికి డెలివరీ బాయ్ నిరాకరిస్తున్నాడని తెలిపింది. నాలుగు బాక్సులు తీసుకోవడానికే అతనికి అనుమతి ఉందని... ఐదు బాక్సులను తీసుకునేందుకు మరో వ్యక్తిని పంపుతామని కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పాడు.

కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఐదు బాక్సులనూ రిటర్న్ తీసుకుంటానని చెప్పాడు. కానీ, మరో వ్యక్తిని పంపిస్తానని కస్టమర్ కేర్ వాళ్లు చెప్పారని, బాక్సులను నీకు ఇవ్వనని బాధితురాలు స్పష్టం చేసింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె హిప్నాటిజంకు గురైంది. స్పృహ సరిగ్గా లేని స్థితిలో ఉన్న ఆమెపై డెలివరీ బాయ్ అత్యాచార యత్నం చేశాడు.

అయితే, కాసేపట్లోనే హిప్నటైజ్ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన ఆమెకు... తన ముందు నిలబడి ప్యాంటును జారవిడిచిన స్థితిలో డెలివరీ బాయ్ కనిపించాడు. వెంటనే తేరుకున్న ఆమె... భయాందోళనలతో కేకలు వేసింది. దీంతో, అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఈ సోమవారం మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Amazon
Delivery Boy
Rape
Delhi

More Telugu News