సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • కార్మికులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • ఊసరవెల్లిలా రంగులు మార్చారంటూ కేసీఆర్ పై విమర్శలు
తమ ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల భాగస్వామ్యం విస్మరించలేనిదని, ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కూడా పోరాడారని రేవంత్ వెల్లడించారు.

టీఆర్ఎస్ పార్టీ చీఫ్ హోదాలో ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని మీరు కూడా అభినందించారని, తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మార్పు తెస్తానని హామీ ఇచ్చారని కేసీఆర్ కు గుర్తు చేశారు. "ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేసిన వారిలో మీరు కూడా ఉన్నారు. కానీ మీరు పాలన చేపట్టాక ఆర్టీసీని పట్టించుకోవడం మానేశారు. సీఎం అయ్యాక ఊసరవెల్లి స్థాయిలో రంగులు మార్చేశారు" అంటూ విమర్శించారు.
KCR
Revanth Reddy
Congress
TRS
TSRTC

More Telugu News