యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం తెలిసీ తెలియనట్టు ఉండటమేంటి?: చంద్రబాబునాయుడు
- ఆళ్లగడ్డ - గాజులపల్లి వరకు యురేనియం తవ్వకాలు
- ఏఎండీ సంస్థ తవ్వకాలు జరుపుతోంది
- ప్రజల ఆందోళనను ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోదు?
యురేనియం తవ్వకాలను నిరసిస్తూ విజయవాడలో ఇటీవల నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైసీపీ నేతలు హాజరుకాకపోవడం వెనుక ఆంతర్యమేంటి? రేపు ఆదివారం ఓబులంపల్లిలో జరిగే అఖిలపక్ష పోరాటానికి వైసీపీ మద్దతు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి నల్లమల అటవీ ప్రాంతానికి ముప్పు తెచ్చారని, విమర్శించారు. ఇప్పుడు ఈ అంశాన్ని సీఎం జగన్ వినీ విననట్టు తప్పించుకుపోతున్నారని, ప్రజలకు, రైతులకూ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.