నేడు ఢిల్లీకి జగన్.. మోదీతో కీలక భేటీ
- ఏపీకి నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరనున్న జగన్
- రివర్స్ టెండరింగ్ ప్రక్రియను వివరించనున్న సీఎం
- పీపీఏలపై కూడా చర్చించనున్న జగన్
పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ఆదా అయిన నిధుల గురించి వివరించనున్నారు. పోలవరంకు గత టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. వివిధ శాఖలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కూడా కోరతారు. విద్యుత్ సంస్థల పీపీఏలపై సమీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే కేంద్రం నుంచి పలు లేఖలు వచ్చిన నేపథ్యంలో, ఈ అంశంపై కూడా ప్రధానికి వివరించనున్నారు. కడప స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి మేజర్ పోర్టు, వెనుకబడిన జిల్లాలకు నిధుల అంశాన్ని కూడా చర్చించనున్నారు.