చేతబడి అనుమానం.. వృద్ధుల పళ్లు పీకి హింసించిన వైనం!
- ఒడిశాలోని గంజాం జిల్లా గోపపూర్లో ఘటన
- 22 మంది మహిళలు సహా 29 మంది అరెస్ట్
- పోలీసులు గ్రామంలోకి రాకుండా కారంపొడి చల్లి అడ్డుకునే ప్రయత్నం
సమాచారం అందుకున్న ఎస్పీ బ్రిజేష్రాయ్ బుధవారం తన బృందంతో వెళ్లి బాధితులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే, గ్రామంలోకి పోలీసులు చొరబడకుండా పొలిమేర్లలో కళ్లలో కారం చల్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టి బలవంతంగా గ్రామంలోకి ప్రవేశించారు. 22 మంది మహిళలు సహా మొత్తం 29 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు పురుషులు గ్రామం నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.