భారత వాయుసేన కేంద్రాల్లో హైఅలర్ట్
- హెచ్చరికలు జారీచేసిన నిఘా వర్గాలు
- జైషే మహ్మద్ ఉగ్రవాదుల కదలికలపై అనుమానాలు
- ఉత్తరాదిన ఉగ్రకలకలం
బాలాకోట్ దాడులకు ప్రతీకారంగా జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని శ్రీనగర్, అమృత్ సర్ హిండన్, అవంతిపూర్ వంటి కీలక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లపై ఆత్మాహుతి దాడులు చేపట్టాలని జైషే మహ్మద్ పక్కా ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్రానికి సమాచారం అందింది. దాంతో, భారత వాయుసేన కేంద్రాల వద్ద భద్రత రెట్టింపు చేయడంతో పాటు, అక్కడి పాఠశాలలను కూడా మూసివేశారు.