పండుగ వేళ జియో బంపర్ ఆఫర్

  • సగం ధరకే ఫీచర్ ఫోన్
  • దసరా కానుకగా రూ.699కే ఫీచర్ ఫోన్
  • రూ.700 విలువ చేసే డేటా ప్రయోజనాలు ఫ్రీ
సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే జియో దసరా వేళ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బేసిక్ ఇంటర్నెట్ ఫోన్ గా ఎంతో ప్రాచుర్యం పొందిన తన జియోఫోన్ ను కేవలం రూ.699 కే అందించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఆ ఫీచర్ ఫోన్ ధర రూ.1500. ఇప్పుడు దసరా కానుకగా 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. 4జీ ఫోన్లు కొనలేని వారికి తమ ఆఫర్ ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నామని జియో పేర్కొంది. ఈ ఆఫర్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.700 విలువ చేసే డేటా సదుపాయాలు లభించనున్నాయి. తద్వారా ఫోన్ ధర పూర్తిగా రిఫండ్ చేసినట్టవుతుందని రిలయన్స్ జియో వర్గాలు తెలిపాయి.
Go Back to Shorts
Jio
Phone
Offer

More Telugu News