విజయవాడలో స్టాఫ్నర్స్పై అత్యాచారం.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు
- గత నెల 4న ఘటన
బాధితురాలి అన్నను చంపేస్తానని బెదిరింపు
ఆత్మహత్యాయత్నంతో వెలుగులోకి
ఆపై ఈ విషయాన్ని బయటకు చెబితే ఆమె అన్నను చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు, అత్యాచార ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 26న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఆరా తీయగా అసలు విషయం బయటకొచ్చింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.