తల్లి సుష్మా స్వరాజ్ చివరి కోర్కెను తీర్చిన కుమార్తె
- కుల్‌భూషణ్ జాదవ్ కేసును వాదించిన హరీశ్ సాల్వే
- రూపాయి ఫీజును చెల్లించి తల్లి చివరి కోరికను తీర్చిన బన్సూరి
- ట్విట్టర్ ద్వారా వెల్లడించిన దివంగత నేత కుమార్తె
కన్నుమూయడానికి గంట ముందు హరీశ్ సాల్వేతో మాట్లాడిన సుష్మా స్వరాజ్.. కేసు గెలిచినందుకు గాను చెల్లించాల్సిన ఫీజు ఒక రూపాయిని వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని ఇటీవల హరీశ్ గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుష్మ కుమార్తె బన్సూరి ఆ రూపాయి ఫీజును చెల్లించి తల్లి చివరి కోరికను తీర్చారు.