‘గుడ్‌మ్యాన్’ బ్యాడ్ పని.. లైవ్‌లో రిపోర్టు చేస్తున్న మహిళా జర్నలిస్టును ముద్దాడి పరార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘గుడ్‌మ్యాన్’ బ్యాడ్ పని.. లైవ్‌లో రిపోర్టు చేస్తున్న మహిళా జర్నలిస్టును ముద్దాడి పరార్!

  • ‘వేవ్ 3’ న్యూస్ చానల్ రిపోర్టర్‌కు చేదు అనుభవం
  • ఆగంతకుడి చర్యతో క్షణకాలం షాక్
  • నిందితుడిపై లైంగిక వేధింపుల కేసు
లైవ్‌లో వార్తలు రిపోర్టు చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టు బుగ్గను ఓ ఆగంతకుడు ముద్దాడి పరారయ్యాడు. అమెరికాలో జరిగిందీ ఘటన. ‘వేవ్ 3’ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్న సారా రివస్ట్.. స్టూడియోలో న్యూస్ రూములో ఉన్న యాంకర్‌తో మాట్లాడుతూ లైవ్‌లో వార్తలు అందిస్తోంది.

 ఈ క్రమంలో ఆమె వెనక నుంచి వెళ్లిన ఓ యువకుడు కాసేపటి తర్వాత ఒక్కసారిగా వచ్చి ఆమె బుగ్గపై ముద్దుపెట్టి తుర్రుమన్నాడు. అతడి చర్యకు క్షణకాలంపాటు బిత్తరపోయిన సారా.. వార్తలు అందించడం మాత్రం మానలేదు. అనంతరం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని ‘గుడ్‌మ్యాన్’గా గుర్తించిన పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. రిపోర్టర్‌కు ముద్దుపెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
america
wave 3 news
woman reporter
kiss

More Telugu News