నేటి నుంచి ఏపీ, తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు

  • రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేటి నుంచే సెలవులు
  • ఏపీలో వచ్చే నెల 10న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు
  • తెలంగాణలో మాత్రం అక్టోబరు 13 వరకు సెలవులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఆయా ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి వచ్చే నెల 9వ వరకు సెలవులు ప్రకటించగా 10న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ సెలవులు పాఠశాలలకు మాత్రమే. ఇక, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అక్టోబరు 6 నుంచి 13 వరకు సెలవులు ప్రకటించింది. తెలంగాణలోనూ నేటి నుంచి ప్రారంభం కానున్న సెలవులు వచ్చే నెల 13 వరకు కొనసాగనున్నాయి. 14న తిరిగి పాఠశాలలు తెరుచుకుంటాయి.  

Go Back to Shorts
Telangana
Andhra Pradesh
dasara holidays

More Telugu News