Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలీవుడ్లో మళ్లీ నయనతార పెళ్లి టాక్

  • వరుస సినిమాలతో నయనతార 
  • విభిన్న కథాచిత్రాలలో అవకాశాలు 
  • డిసెంబర్లో పెళ్లి అంటూ టాక్  
ఒక వైపున తెలుగు సినిమాలతోను .. మరో వైపున తమిళ సినిమాలతోను నయనతార ఫుల్ బిజీగా వుంది. భారీగా పారితోషికం పెంచేసిన ఆమెకి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం తగ్గడం లేదు. దాంతో నయనతారకి ప్రత్యామ్నాయం లేదనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. అలాగే ఈ డిసెంబర్లో ఆమె వివాహం విఘ్నేశ్ శివన్ తో జరగనుందనే టాక్ కూడా అక్కడ బలంగా వినిపిస్తోంది.

నయనతార .. విఘ్నేశ్ శివన్ చాలా కాలంగా ప్రేమలో వున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో వుంటున్నారనే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది. ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూనే, ఏ మాత్రం తీరిక దొరికినా విదేశాల్లో విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఈ డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సారైనా వీళ్లు ఈ ప్రచారాన్ని నిజం చేస్తారో .. లేదంటే ఎప్పటిమాదిరిగానే చెట్టాపట్టాల్ తోనే సరిపెడతారో చూడాలి.
Nayanatara
Vighnesh Shivan

More Telugu News