15 ఏళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యాను: హాలీవుడ్ స్టార్ డెమీమూర్
- నా కన్నతల్లే నన్ను ఓ వ్యక్తికి అమ్మేసింది
- తన ఆత్మకథలో వెల్లడించిన డెమీ మూర్
- 'ఇన్ సైడ్ అవుట్' పేరుతో ఆత్మకథ
15 ఏళ్ల వయసులోనే తాను అత్యాచారానికి గురయ్యానని డెమీమూర్ తన ఆత్మకథలో పేర్కొంది. తన కన్నతల్లే తనను ఓ వ్యక్తికి 500 డాలర్లకు అమ్మేసిందని తెలిపింది. ఇలాంటి విషయాలతో పాటు బ్రూస్ విల్లీస్ తో తన ప్రేమాయణం, పెళ్లి వరకు వెళ్లి బంధం తెగిపోవడం, తనకన్నా చిన్నవాడైన కుచర్ తో డేటింగ్ వంటి ఎన్నో వ్యక్తిగత విషయాలను వెల్లడించింది.